బీఎస్సీ నర్సింగ్ రెండో విడత కౌన్సిలింగ్! 1 m ago
నర్సింగ్ కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్లు, రెండేళ్ల కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్ కు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ నెల 5 నుంచి 7 వరకు విశ్వ విద్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కన్వీనర్ కోటాకు సంబంధించి ఆయా కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను రెండో విడతలోనే భర్తీ చేయనున్నారు.